ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పోయింది
కాక్రోచ్ జనతా పార్టీ నేతల అరెస్టుల వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. దేశంలో ఎన్నికల వ్యవస్థ తీరు తెన్నులపై ఘాటు విమర్శలు గుప్పించిన ఆయన, సిజేపీ నేతలకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అంతా జరిగిపోయిన తర్వాత అధికారులతో విచారణలు జరిపించడం, కంటితుడుపు చర్యలకు దిగడం కంటే, నష్టం జరగక ముందే వ్యవస్థలు జాగ్రత్త పడటం ఎంతో మంచిదని జగన్ హితవు పలికారు. ప్రక్షాళన చేయాల్సింది రాజకీయ నేతలను కాదని, లోపభూయిష్టంగా...