ఏటీఎంలో భారీ చోరీ

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఏటీఎం చోరీ కలకలం రేపింది. సాతం రాయ్‌లోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంను టార్గెట్ చేసిన దుండగులు గ్యాస్ కట్టర్లతో ఏటీఎం మిషన్‌ను కోసి సుమారు రూ.20 లక్షల నగదును దోచుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.తెల్లవారుజామున పక్కా స్కెచ్‌తో రంగంలోకి దిగిన దొంగలు.. ఏటీఎంలోని సీసీ కెమెరాలపై స్పే కొట్టి, వైర్లను కట్ చేసి ఆధారాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించారు. అనంతరం గ్యాస్ కట్టర్లతో ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేసి నగదును ఎత్తుకెళ్లారు.ఏటీఎం వద్ద నైట్ వాచ్‌మన్ లేకపోవడం...