కూలీ పనులు చేసుకునే యువకుడిపై ఖాకీ ప్రతాపం.. ‘లాకప్ డెత్’ అంటూ తీవ్ర దుమారం!

అమరావతి, జూన్ 18: విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనంగా మారింది. పోలీసుల అదుపులోకి వెళ్లిన తర్వాతే సాయికృష్ణ కనిపించకుండా పోయాడని, అతనిని లాకప్‌లో చిత్రహింసలు పెట్టి కొట్టి చంపేశారంటూ (కస్టోడియల్ డెత్) కుటుంబ సభ్యులు, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అసలేం జరిగింది? బాధితుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణపై గతంలో కొన్ని కేసులు ఉండటంతో పోలీసులు రౌడీషీట్ తెరిచారు. అయితే, పోలీసుల...