ఖమ్మంలో భగ్గుమన్న కేటీఆర్.. రేవంత్, పొంగులేటిలకు స్ట్రాంగ్ వార్నింగ్!

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ (BRS) కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని ఆయన మండిపడ్డారు. మంత్రి పొంగులేటిపై అవినీతి ఆరోపణలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన పదవిని అడ్డం పెట్టుకుని భారీగా అక్రమ ఆస్తులు కూడబెడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర ఖజానాకు ఆదాయం పడిపోతుంటే,...