janasamayam.com
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 10:47 pm Posted by : JANA SAMAYAM

గురుకులంలో ఆకస్మిక తనిఖీ.. విద్యార్థులతో ఎమ్మెల్యే ముఖాముఖి

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డులో గల మహాత్మ జ్యోతిబాఫూలే బీసీ గురుకుల బాలుర పాఠశాల/కళాశాలను నాగర్‌కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, హాస్టల్ గదులు, మౌలిక వసతులు, విద్యార్థులకు అందుతున్న ఆహార నాణ్యత మరియు భద్రతా ప్రమాణాలను ఆయన స్వయంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు, చదువు సాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రజా ప్రభుత్వం గురుకుల విద్యార్థులకు మెరుగైన వసతులు, విద్యా వాతావరణం కల్పించేందుకు కట్టుబడి ఉందన్నారు. ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ విద్యార్థులకు అందుబాటులో ఉంటూ వారి విద్యాభివృద్ధికి, భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గురుకుల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.