గురుకులంలో ఆకస్మిక తనిఖీ.. విద్యార్థులతో ఎమ్మెల్యే ముఖాముఖి
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డులో గల మహాత్మ జ్యోతిబాఫూలే బీసీ గురుకుల బాలుర పాఠశాల/కళాశాలను నాగర్కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, హాస్టల్ గదులు, మౌలిక వసతులు, విద్యార్థులకు అందుతున్న ఆహార నాణ్యత మరియు భద్రతా ప్రమాణాలను ఆయన స్వయంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు, చదువు సాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వం గురుకుల విద్యార్థులకు...