‘చలో హైదరాబాద్’ రణరంగం: మీడియా ప్రతినిధుల అరెస్టులపై జర్నలిస్ట్ సంఘాల తీవ్ర ఆగ్రహం!
హైదరాబాద్లో జర్నలిస్టులు చేపట్టిన 'చలో హైదరాబాద్' కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జర్నలిస్టుల సంక్షేమ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) పిలుపునిచ్చిన ఈ ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి పెద్ద ఎత్తున జర్నలిస్టులు ఈ నిరసనలో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న జర్నలిస్టులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. ధర్నాకు దిగిన జర్నలిస్టులను, సంఘాల నాయకులను పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి అరెస్టు చేశారు. అరెస్టు చేసిన...