డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ ఆందోళన
విజయవాడ: డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై వైఎస్సార్సీపీ శ్రేణులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. తమ పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా ఆందోళన చేస్తుండగా టీడీపీ శ్రేణులు, పోలీసులు కలిసి దాడులకు పాల్పడ్డారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు.అరెస్టు చేసిన తమ పార్టీ నేతను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కృష్ణలంక పోలీస్స్టేషన్ వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తలతో కలిసి సురేష్ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్సీ అవకతవకలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం...