కనిగిరి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ తరపున పులి శాంతి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, కనిగిరి నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్, బత్తుల బ్రహ్మానందరెడ్డి, కసుకుర్తి ఆదేన్న, చింతలచెరువు సత్యనారాయణ రెడ్డి తదితరులు హాజరయ్యారు. నామినేషన్‌కు పులి శాంతి నివాసం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ, మున్సిపల్ చైర్మన్‌తో పాటు 32 వార్డుల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం పులి శాంతి మాట్లాడుతూ గతంలో మున్సిపల్ వైస్ చైర్మన్‌గా పనిచేసిన అనుభవంతో ప్రజలకు సేవ చేసేందుకు మరో అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, వివిధ స్థాయిల ప్రతినిధులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.