మున్సిపల్ చైర్మన్ వైసిపి అభ్యర్థిగా పులి శాంతి నామినేషన్.

కనిగిరి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ తరపున పులి శాంతి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, కనిగిరి నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్, బత్తుల బ్రహ్మానందరెడ్డి, కసుకుర్తి ఆదేన్న, చింతలచెరువు సత్యనారాయణ రెడ్డి తదితరులు హాజరయ్యారు. నామినేషన్‌కు పులి శాంతి నివాసం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి వెళ్లి నామినేషన్...