మెట్రో ప్యాసింజర్లకు అదిరిపోయే తీపి కబురు.. పట్టాలెక్కనున్న 60 కొత్త కోచ్‌లు!

భాగ్యనగర మెట్రో ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం ఒక పెద్ద ఊరటనిచ్చే ప్రకటన చేసింది. నిత్యం రద్దీతో కిక్కిరిసిపోయే మెట్రో రైళ్లలో ఇబ్బందులకు శాశ్వత చెక్ పెట్టేందుకు రేవంత్ సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నగరవాసుల ప్రయాణ కష్టాలను తీరుస్తూ.. మెట్రోలో అదనంగా 60 కొత్త కోచ్‌లను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 60 కొత్త కోచ్‌ల కొనుగోలుకు రంగం సిద్ధం ప్రస్తుతం హైదరాబాద్‌లోని మూడు ప్రధాన కారిడార్లలో మొత్తం 56 మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. అయితే, ప్రతి రైలుకు కేవలం...