janasamayam.com
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 5:09 pm Posted by : JANA SAMAYAM

సింగరేణి భవన్ ముట్టడించిన కల్వకుంట్ల కవిత

తెలంగాణ రక్షణ సేన సోమవారం నాడు సింగరేణి భవన్ ను ముట్టడించింది. ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత్రి కవిత పాల్గోన్నారు. సీఎండీ వచ్చి చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వాలని డిమాండ్ చేసారు. కవిత మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆరఎస్, హెచఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నాం. డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వకుండా సింగరేణి యాజమాన్యం తప్పించుకుంటోంది. డిపెండెంట్ ఉద్యోగాలు కార్మికుల హక్కు. అది మీరు వేసే బిచ్చం కాదని అన్నారు. కచ్చితంగా నెలకు రెండు రోజులు మెడికల్ బోర్డు పెట్టాల్సిందే. సింగరేణి లాభాల్లో 35 శాతం బోనస్ ను కార్మికులకు ఇవ్వాల్సిందే. అలియాస్ పేర్లు ఉన్న కార్మికులను విజిలెన్స్ పేరుతో వేధించవద్దు. కార్మికులను వేధిస్తూ అక్రమంగా ఉద్యోగాలు తొలగించిన వాళ్లకు మళ్లీ ఉద్యోగాలు ఇవ్వాలి. సమస్యల పరిష్కారానికి సంబంధించి సీఎండీ వచ్చి మాతో చర్చలు జరపాలని అన్నారు.