సింగరేణి భవన్ ముట్టడించిన కల్వకుంట్ల కవిత

తెలంగాణ రక్షణ సేన సోమవారం నాడు సింగరేణి భవన్ ను ముట్టడించింది. ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత్రి కవిత పాల్గోన్నారు. సీఎండీ వచ్చి చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వాలని డిమాండ్ చేసారు. కవిత మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆరఎస్, హెచఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నాం. డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వకుండా సింగరేణి యాజమాన్యం తప్పించుకుంటోంది. డిపెండెంట్ ఉద్యోగాలు కార్మికుల హక్కు. అది మీరు వేసే బిచ్చం కాదని అన్నారు. కచ్చితంగా నెలకు రెండు రోజులు మెడికల్ బోర్డు పెట్టాల్సిందే....