సిద్దిపేట ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి ప్రజల కంటికి రక్షణ కవచం..
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే నిజమైన అభివృద్ధి అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఎల్.వి. ప్రసాద్ ఆసుపత్రి ద్వారా సేవలు అందించామని ఆయన తెలిపారు. ముఖ్యంగా డ్రైవర్లు కంటి పరీక్షలు చేయించుకోవాలని, వారికి ఉచితంగా కంటి పరీక్షలు చేయించి, అద్దాలు ఇప్పించే బాధ్యత తనదేనని హరీష్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నామని...