“సీఎం చంద్రబాబు జనాభా పాలసీపై నటి పూనమ్ కౌర్ కౌంటర్.. నెట్టింట వైరల్!”

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనాభా నియంత్రణ, రాష్ట్ర భవిష్యత్తుపై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై నటి, కాంగ్రెస్ నాయకురాలు పూనమ్ కౌర్ సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. ఈ క్రమంలో ఆమె మంత్రి నారా లోకేష్‌ను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఏపీలో యువత సంఖ్య తగ్గిపోతోందని, వృద్ధుల జనాభా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో...