స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగు కేంద్రాల వద్ద పట్టిష్ట భద్రత
విజయనగరం పట్టణంలో నిర్వహించే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బ్యాలట్ బాక్సులను భద్రపర్చే స్టాంగ్ రూమ్స్, ఓట్ల లెక్కింపు నిర్వహించే నిర్వహించే రాజీవ్ క్రీడా ప్రాంగణంలోని ఇన్ డోర్ స్టేడియంను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, మరియు జిల్లా కలెక్టరు ఎస్. రామసుందర్ రెడ్డి, సంయుక్తంగా సందర్శించి, మున్సిపల్ అధికారులు చేపడుతున్న ఏర్పాట్లును పరిశీలించి, పలు సూచనలు చేసారు.జిల్లా ఎస్పీ కలెక్టరు మాట్లాడుతూ అనుమతి లేని వ్యక్తులను బ్యాలట్ బాక్సులను భద్రపర్చే స్ట్రాంగ్ రూమ్ పరిసరాల్లోకి ప్రవేశించకుండా బ్యారికేడ్స్ ఏర్పాటు చేయాలని, ఓట్ల లెక్కింపు నిర్వహించే కేంద్రంలో...