పెట్రో ధరల మోతపై జగన్ కీలక నిర్ణయం.. రేపు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఆందోళనలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కూటమి ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైంది. రాష్ట్రంలో విపరీతంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా రేపు (సోమవారం) ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని కూటమి ప్రభుత్వం (టీడీపీ-జనసేన-బీజేపీ) హామీ ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చాక ఆ మాట తప్పిందని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్రో ధరలు ఉన్నాయని.. ప్రభుత్వం...