HomeAndhra Pradeshవారంలో ఎన్నికల నోటిఫికేషన్

వారంలో ఎన్నికల నోటిఫికేషన్

📰 Generate e-Paper Clip

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేసాయి. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల నగారా మోగించేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈ నెల 7న అమరావతి నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్… అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు , పోలీస్ కమిషనర్లతో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు.సమావేశంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన క్షేత్రస్థాయి సంసిద్ధతను కమిషన్ నిశితంగా పరిశీలించనుంది. ఓటర్ల జాబితా ఖరారు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, బ్యాలెట్ బాక్సులు లభ్యత, ఎన్నికల నిర్వహణా సిబ్బంది కేటాయింపు , సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు వంటి అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలకు ఎస్‌ఈసీ స్పష్టమైన దిశానిర్దేశం చేయనుంది. నిష్పాక్షికంగా, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడమే లక్ష్యంగా యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తున్నారు.కలెక్టర్లు, ఎస్పీల భేటీ ముగిసిన వెంటనే… ఈ నెల 8 లేదా 9 తేదీల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎస్‌ఈసీ అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి స్థానిక పోరు కావడంతో అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కూటమి తమ పట్టును మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తుంటే… ప్రతిపక్ష వైఎస్సార్‌‌సీపీ క్షేత్రస్థాయిలో పుంజుకోవడానికి ఈ ఎన్నికలను సవాలుగా తీసుకుంటోంది.సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లపై ఎలాంటి తీర్పు వచ్చినా దానికి తగ్గట్లుగా నోటిఫికేషన్ ఇవ్వనున్నారు

RELATED ARTICLES

Most Popular