HomeTelanganaఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు చిన్నారులు మృతి

ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు చిన్నారులు మృతి

📰 Generate e-Paper Clip

ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో అర్ధరాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. పిల్లల వార్డులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఏసీ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, పలువురు చిన్నారులు గాయపడటంతో పాటు పొగ కారణంగా అస్వస్థతకు గురయ్యారు.ప్రమాదం జరిగిన సమయంలో పిల్లల వార్డులో మొత్తం 27 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మంటలు, పొగ వ్యాపించడంతో వార్డులో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న సిబ్బంది, సహాయక బృందాలు వెంటనే స్పందించి చిన్నారులను సురక్షితంగా బయటకు తరలించే చర్యలు చేపట్టారు.గాయపడిన, అస్వస్థతకు గురైన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేందుకు పలువురిని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ వెంటనే రిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై సమగ్ర వివరాలు సేకరించి తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.ఈ ఘటనతో చిన్నారుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రమాదానికి అసలు కారణాలు, ఆస్పత్రిలో భద్రతా ఏర్పాట్లపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular