అంబేద్కర్ ఆశయాలు సాధించేందుకే జాతర కొనసాగించాలి
విశారదన్ మహరాజ్
అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శి యు.మహేష్,చిన్నయ్య
నారాయణ పేట జిల్లా కేంద్రంలో పూలే అంబేద్కర్ 4వ జాతర సందర్భంగా భారీ భీమ్ ర్యాలీని భారం భావి నుండి శీల గార్డెన్ వరకు జాతర కమిటీ నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన విశారదన్ మహరాజ్ మాట్లాడుతూ దేశంలో అణగారిన వర్గాల కోసం కలలు కన్నా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను నేటి యువత ఉనికిపించుకోవాలని ఆయన ఆశయ సాధన బాటలో నడవాలని పిలుపునిచ్చారు, అలాగే దేశంలో రాష్ట్రంలో పాలిస్తున్న పాలకులు ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల హక్కులను కాల రాస్తున్నారని ఆయన అన్నారు , అంబేద్కర్ జాతర అంటే అన ఆశలను ఆయన కోరుకున్న సిద్ధాంతాలను ఉనికిపించుకోవాలని అలాంటి యువత నారాయణపేటలో ప్రతి సంవత్సరం అంబేద్కర్ జాతర నిర్వహించడం గొప్ప విషయమని జాతర నిర్వహిస్తున్న జాతర కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు,జాతర కమిటీ అధ్యక్షులు యు. మహేష్, ప్రధాన కార్యదర్శి చిన్నయ్య,కమిటీ నాయకులు మాట్లాడుతూ.. గత నేల నుండి జాతర నిర్వహణ కు జిల్లా లోని దామరగిద్ద,నారాయణపేట, మద్దూరు,కోస్గి,కొత్తపల్లి, ఉట్కూరు,ధన్వాడ,మక్తల్, మరికల్,మిగతా మండలలో గ్రామాలలో కమిటీలు వేసి జాతర నిర్వహణ కు నాయకులు కృషి చేశారు.పూలే,అంబేద్కర్ ఆశయాలు సాధన,రాజ్యాంగం రక్షణ కోసం జాతర ను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామన్నారు.ప్రజానాట్యమండలి,కళాకారుల డప్పుల కార్యక్రమం ఆకర్షణగా నిలించింది.ఈ కార్యక్రమంలో మహిళలు, యువకులు ఉత్సాహంగా పాల్గొని ర్యాలీని ఘనంగా విజయవంతంగా నిర్వహించారు.

