HomeTelanganaజర్నలిస్టులందరికీ గుడ్ న్యూస్ 💐

జర్నలిస్టులందరికీ గుడ్ న్యూస్ 💐

📰 Generate e-Paper Clip

గుడ్ న్యూస్ 💐

అర్హులైన జర్నలిస్టులందరికీ హైదరాబాద్‌లో ఇళ్ల స్థలాలు కేటాయింపు: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

అర్హులైన జర్నలిస్టులందరికీ హైదరాబాద్‌లో ఇళ్ల స్థలాలు కేటాయించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈరోజు హైదరాబాద్ లోని అన్నీ హౌసింగ్ సొసైటీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న మంత్రి, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ విషయంపై సంబంధిత శాఖలతో చర్చలు జరిపి త్వరలో స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో హౌసింగ్ సొసైటీల ప్రతినిధులు తమ సమస్యలు, అభ్యర్థనలు మంత్రికి వివరించారు. వాటిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, జర్నలిస్టుల అందరూ ఓకే మాట మీదకు రావడం శుభపరిణామ అన్నారు. అన్నీ అంశాలను పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో హౌసింగ్ సొసైటీల ప్రతినిధులు పాల్గొనన్నారు

RELATED ARTICLES

Most Popular