తెలంగాణలో డిగ్రీ కాలేజీ విద్యార్ధుల్లో యువ క్రికెట్ ప్రతిభను వెలికితీసేందుకు టోర్ని నిర్వహించడం అభినందనీయమని మంత్రులు దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, పోన్నం ప్రభాకర్ లు తెలిపారు. సోమవారం మంత్రులు దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, పోన్నం ప్రభాకర్ లు క్రికెట్ బ్రోచర్లను విడుదల చేశారు.జనవరిలో జరిగే ఈ టోర్నమెంట్ లో విద్యార్ధలు పాల్గొనాలని సూచించారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు చేస్తున్న క్రిషిని మంత్రి శ్రీధర్ బాబు అభినందించారు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గ్రావిÖణ విద్యర్ధులను ప్రోత్సహించేందుకు ఈ తరహా పోటీలు అవసరమని తెలిపారు. గ్రావిÖణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ కళాశాలల స్థాయిలో క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నారు.గ్రావిÖణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు టీ 20 క్రికెట్ బాష్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డాక్టర్ ఆకునూరు గౌతమ్, వి. అజయ్, రామక్రిష్ణలు తెలిపారు. ఈ టోర్నీలో ఆడి సత్తా చాటుకోవాలనుకునేవారు వెంటనే తమ పేర్లు నమోదు చేసుకోవాలి. జిల్లా, ప్రాంతీయ స్థాయిల మ్యాచ్లు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి. మ్యాచ్ సమయంలో రెండు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్), వయసు ధ్రువీకరణకు పదో తరగతి మెమో (ఒరిజినల్)ను నిర్వాహకులకు తప్పనిసరిగా చూపించాలి. మ్యాచ్ జరిగే సమయంలో బ్యాటర్లు, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్లు, అండర్ గార్డ్స్, హ్యాండ్ గ్లోవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూ ధరించాలి. అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయ కానుంది. నాకౌట్ పద్ధతిలోజిల్లా, ప్రాంతీయ, తుది దశల్లో పోటీలు జరుగుతాయి తెలంగాణ రాష్టాలలో కొత్త జిల్లాల ప్రాతిపదికన పోటీలు నిర్వహిస్తారు. మరిన్ని వివరాలకు అజయ్ 8186936117 నెంబర్లలో సంప్రదించాలి

