ఆధార్ సేవా కేంద్రం ద్వారా ప్రజలకు స్థానికంగానే మరింత మెరుగైన సేవలు లభిస్తాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మున్నూరుకాపు సంఘం భవనంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యÖఐడీఏఐ) ఆధ్వర్యంలో నూతనంగా నెలకొల్పిన ఆధార్ సేవా కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆధార్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, ఆధార్‌కు సంబంధించిన వివిధ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే ఉద్దేశంతో ఆధార్ సేవా కేంద్రాల విస్తరించడం జరుగుతోందని తెలిపారు. ఇదివరకు ఆధార్ సేవల కోసం హైదరాబాద్ కు వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం నిజామాబాద్ సహా తెలంగాణలో 10 ప్రాంతాలలో ఆధార్ సేవా కేంద్రాలను కొత్తగా అందుబాటులోకి తెచ్చారని అన్నారు. దీనివల్ల ప్రజలు ఆధార్‌కు సంబంధించిన సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, స్థానికంగానే సేవలు పొందేందుకు ఇవి ఉపయోగపడతాయని అన్నారు. ఆధార్ సేవా కేంద్రం ద్వారా కొత్త ఆధార్ నమోదు, ఆధార్ కార్డులో వివరాల సవరణ, చిరునామా మార్పు, పేరు, పుట్టిన తేదీ వంటి వివరాల్లో అర్హత మేరకు మార్పులు చేసుకునే వెసులుబాటు కలిగిందన్నారు. ఆధార్ సేవల కోసం కేంద్రానికి వచ్చే ప్రజలు తమ వెంట అవసరమైన గుర్తింపు, చిరునామా, జనన తేదీ ధ్రువీకరణ పత్రాలను సంబంధిత సేవకు అనుగుణంగా తీసుకురావాలని తెలిపారు. వివిధ సేవలకు సంబంధించి యÖఐడీఏఐ నిర్దేశించిన నిర్ణీత రుసుము మాత్రమే చెల్లించాలని సూచించారు.నిజామాబాద్ లో నూతన ఆధార్ సేవా కేంద్రం అందుబాటులోకి రావడం వల్ల నగర ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల వారికి కూడా ఆధార్ సంబంధిత సేవలు పొందడంలో సౌలభ్యం ఏర్పడిందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకింగ్, వివిధ సేవల కోసం ఆధార్ వివరాలు అవసరం అవుతున్న దృష్ట్యా, ప్రజలు తమ ఆధార్ సమాచారాన్ని సక్రమంగా ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు.అవసరమైన సేవల కోసం నూతన ఆధార్ సేవా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆధార్ ప్రాధికార సంస్థ హైదరాబాద్ ప్రాంతీయ అధికారి శ్రవణ్, ఈ`డిస్టిక్ట్ మేనేజర్ కార్తీక్ కుమార్, ఆధార్ సేవా కేంద్రం ఆపరేషనల్ మేనేజర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

