విజయనగరం పట్టణంలో నిర్వహించే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బ్యాలట్ బాక్సులను భద్రపర్చే స్టాంగ్ రూమ్స్, ఓట్ల లెక్కింపు నిర్వహించే నిర్వహించే రాజీవ్ క్రీడా ప్రాంగణంలోని ఇన్ డోర్ స్టేడియంను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, మరియు జిల్లా కలెక్టరు ఎస్. రామసుందర్ రెడ్డి, సంయుక్తంగా సందర్శించి, మున్సిపల్ అధికారులు చేపడుతున్న ఏర్పాట్లును పరిశీలించి, పలు సూచనలు చేసారు.
జిల్లా ఎస్పీ కలెక్టరు మాట్లాడుతూ అనుమతి లేని వ్యక్తులను బ్యాలట్ బాక్సులను భద్రపర్చే స్ట్రాంగ్ రూమ్ పరిసరాల్లోకి ప్రవేశించకుండా బ్యారికేడ్స్ ఏర్పాటు చేయాలని, ఓట్ల లెక్కింపు నిర్వహించే కేంద్రంలో కూడా బ్యారికేడ్స్, 8 అడుగుల ఎత్తులో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. స్టాంగ్ రూమ్స్ వద్ద, రాజీవ్ క్రీడా ప్రాంగణంలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసి, నిరంతరం భద్రతను పర్యవేక్షించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.కౌంటింగు కేంద్రాల్లోకి అనుమతించే వ్యక్తుల పాస్ లను, గుర్తింపు కార్డులను పరిశీలించి, అర్హత కలిగిన వ్యక్తులను, ఏజంట్స్, ఇతర అధీకృత వ్యక్తులను మాత్రమే అనుమతించాలన్నారు.స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగు కేంద్రం వద్ద ప్రజలను, ఏజంట్లను అప్రమత్తం చేసేందుకు పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్, బెల్ హెల్స్ ను ఏర్పాటు చేయాలన్నారు. పోలింగు కేంద్రాలకు పోలింగు మెటీరియల్ తో డిస్ట్రిబ్యూషన్ సెంటరు నుండి తరలివెళ్ళే సమయంలోనే భద్రత విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది కూడా వెళ్ళే విధంగాను, ఓటింగు ముగిసిన తరువాత సురక్షితంగా బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్స్ కు తరలించే విధంగా భద్రత సిబ్బంది, రూట్ మొబైల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలన్నారు.ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద విద్యుత్ సరఫరా నిరంతరాయంగా పని చేసేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలన్నారు. కౌంటింగు కేంద్రంకు దగ్గరలోనే మీడియా పాయింట్ ఏర్పాటు చేయాలని, ఓట్ల లెక్కింపు వివరాలను ప్రతీ రౌండ్ పూర్తయిన వెంటనే సమాచారాన్ని ఎటువంటి జాప్యం లేకుండా అందించాలన్నారు. ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బంది ఎవరైనా గైర్హజరైనా, విధుల్లో నిర్లక్షం వహించినా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.అనంతరం, రాజీవ్ క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగు కేంద్రం, విÖడియా పాయింట్, వాహనాల పార్కింగు, ఫుడ్ కోర్టు స్థలాలను పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేసారు.
స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగు కేంద్రాల వద్ద పట్టిష్ట భద్రత
RELATED ARTICLES

