HomeAndhra Pradeshవిజయవాడలో భారీ సైబర్ మోసం: డిజిటల్ అరెస్ట్ పేరుతో రిటైర్డ్ ఇంజినీర్‌కు రూ.10 కోట్ల టోకరా!

విజయవాడలో భారీ సైబర్ మోసం: డిజిటల్ అరెస్ట్ పేరుతో రిటైర్డ్ ఇంజినీర్‌కు రూ.10 కోట్ల టోకరా!

📰 Generate e-Paper Clip

విజయవాడలో సైబర్ నేరగాళ్లు సంచలనం సృష్టించారు. ముంబై సీబీఐ అధికారులమంటూ నాటకమాడి ఒక రిటైర్డ్ ఇంజినీర్‌ను “డిజిటల్ అరెస్ట్” పేరుతో బెదిరించి ఏకంగా రూ. 10 కోట్లు నొక్కేశారు.బాధితుడి ఫోన్ నంబర్ పలు నేరాల్లో వాడారని, అతడి బ్యాంక్ ఖాతాకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని వీడియో కాల్‌లో భయపెట్టిన ముఠా… కేసు నుంచి బయటపడేస్తామని నమ్మించి సెప్టెంబర్ 22న రూ. 3 కోట్లు, ఆ తర్వాత మరో రూ. 7 కోట్లు తమ ఖాతాలకు బదిలీ చేయించుకుంది.అనుమానం వచ్చి వృద్ధుడు పోలీసులను ఆశ్రయించడంతో తక్షణమే స్పందించిన అధికారులు నేరగాళ్ల బ్యాంక్ ఖాతాలోని రూ. 7 కోట్లను ఫ్రీజ్ చేశారు.పోలీసుల హెచ్చరిక: చట్టంలో “డిజిటల్ అరెస్ట్” అనేదే లేదు! సీబీఐ, ఈడీ, పోలీస్ అధికారులు ఎవరూ వీడియో కాల్స్‌లో విచారణలు, అరెస్టులు చేయరు. ఇలాంటి కాల్స్ వస్తే భయపడకుండా వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయండి

RELATED ARTICLES

Most Popular