కాక్రోచ్ జనతా పార్టీ నేతల అరెస్టుల వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. దేశంలో ఎన్నికల వ్యవస్థ తీరు తెన్నులపై ఘాటు విమర్శలు గుప్పించిన ఆయన, సిజేపీ నేతలకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అంతా జరిగిపోయిన తర్వాత అధికారులతో విచారణలు జరిపించడం, కంటితుడుపు చర్యలకు దిగడం కంటే, నష్టం జరగక ముందే వ్యవస్థలు జాగ్రత్త పడటం ఎంతో మంచిదని జగన్ హితవు పలికారు. ప్రక్షాళన చేయాల్సింది రాజకీయ నేతలను కాదని, లోపభూయిష్టంగా మారిన ఎన్నికల వ్యవస్థనే అని ఆయన ఎక్స్ వేదికగా తేల్చిచెప్పారు.అఏఖ కీలక నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కేవలం అరెస్టులు, అణచివేత చర్యలతో ఏవిÖ సాధించలేరని, ఇటువంటి చర్యల వల్ల పరిస్థితి సర్దుమణగకపోగా మరింత దిగజారుతుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తే వ్యవస్థలపై ప్రజల్లో ఉన్న మిగిలిన కాస్త నమ్మకం కూడా పూర్తిగా ఆవిరైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అరెస్ట్ అయిన అశుతోష్, సౌరవ్ దాస్‌లకు తన సానుభూతిని తెలియజేస్తూ ఆయన ప్రత్యేకంగా ట్వీట్ చేశారు.ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లోపించడం వల్లనే ఈ తరహా నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయని జగన్ తన ట్వీట్లో విశ్లేషించారు. ప్రస్తుతం మన వ్యవస్థలోనే పెద్ద లోపం ఉంది. ఎన్నికల వ్యవస్థపై పౌరుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించాల్సిన గురుతర బాధ్యత అధికారులపై ఉంది. అంతేగానీ ప్రశ్నించే గొంతులను జైలుపాలు చేయడం పరిష్కారం కాదు అని జగన్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం , ప్రభుత్వ యంత్రాంగాలు పక్షపాత వైఖరిని వీడి, ప్రజాస్వామ్య సూత్రాలను కాపాడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.సిజేపీ నేతలకు మద్దతుగా వైఎస్సార్సీపీ అధినేత జగన్ చేసిన ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో, సోషల్ విÖడియా వేదికల్లో వైరల్‌గా మారింది. జగన్ మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ సిజేపీ సీనియర్ నేతలు అభిజిత్ దీప్కే, అజింక్య షిండేలు ఆయన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. క్లిష్ట సమయంలో తమ పోరాటానికి వైఎస్సార్సీపీ అండగా నిలవడం భావప్రకటన స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య పరిరక్షణకు కొత్త ఊపిరి పోసిందని పేర్కొన్నారు.
ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పోయింది
RELATED ARTICLES

