కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సొంటిరెడ్డి పునారెడ్డి చురుగ్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు, కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, పోలియో మహమ్మారి లేని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.
“పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. ఐదేళ్ల లోపు వయసున్న ప్రతి చిన్నారికి తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి వారి భవిష్యత్తుకు రక్షణ కల్పించాలి.”




