అనకాపల్లి జిల్లాలో వెలుగుచూసిన గంజాయి అక్రమ రవాణా కేసులో సత్తెనపల్లికి చెందిన ఇద్దరు యువకులను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వాహనాల తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా వెళ్తున్న కారును ఆపేందుకు పోలీసులు ప్రయత్నించగా, అందులో ఉన్న వ్యక్తులు వాహనాన్ని అక్కడే వదిలి పరారైనట్లు సమాచారం. తనిఖీలు నిర్వహించిన పోలీసులు కారులో సుమారు 200 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చేపట్టిన దర్యాప్తులో ఈ అక్రమ రవాణాలో సత్తెనపల్లికి చెందిన ఇద్దరు యువకుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించి మరికొంత మంది పాత్రపై కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.




