HomeCrime"100 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చి డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో తప్పిన ప్రాణాపాయం."

“100 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చి డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో తప్పిన ప్రాణాపాయం.”

📰 Generate e-Paper Clip

ఆదివారం తెల్లవారుజామున కేబుల్‌ బ్రిడ్జిపై ఒక కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. జూబ్లీహిల్స్ వైపు నుంచి వస్తున్న  కారు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ బ్రిడ్జిపై ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో లోపల ఉన్నవారికి ప్రాణాపాయం తప్పింది. అలాగే, ఆ సమయంలో బ్రిడ్జిపై ఇతర వాహనాలు ఏవీ లేకపోవడంతో భారీ ప్రమాదం తృటిలో తప్పినట్లయింది.

RELATED ARTICLES

Most Popular